తెలుగు వ్యాకరణం - వర్ణ మాల
केयूराणि न भूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वलाः
न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजाः ।
वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते
क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम् ।।
- नीति शतकम्
keyūrāṇi na bhūṣayanti puruṣaṁ hārā na candrojjvalāḥ
na snānaṁ na vilepanaṁ na kusumaṁ nālaṅkṛtā mūrdhajāḥ |
vāṇyekā samalaṅkaroti puruṣaṁ yā saṁskṛtā dhāryate
kṣīyante khalu bhūṣaṇāni satataṁ vāgbhūṣaṇaṁ bhūṣaṇam ||
- Nīti Śatakam
केयूराणि (keyūrāṇi) – bracelets worn in the upper arm; न (na) – not; भूषयन्ति (bhūṣayanti) – adorn; पुरुषं (puruṣaṁ) – person; हाराः (hārāḥ) – garlands, necklaces; न (na) – not; चन्द्रोज्जवलाः (candrojjvalāḥ) – shining like the moon; न (na) – not; स्नानं (snānaṁ) – bath; न (na) – not; विलेपनं (vilepanaṁ) – smearing with fragrant oils; न (na) – not; कुसुमं (kusumaṁ) – flower; न (na) – not; अलङ्कृताः (alaṅkṛtāḥ) – decorated; मूर्धजाः (mūrdhajāḥ) – hair; वाणी (vāṇī) – speech; एका (ekā) – alone; समलङ्करोति‑ (samalaṅkaroti) – highly decorates, embellishes; पुरुषं (puruṣaṁ) – person; या (yā) – which; संस्कृता (saṁskṛtā) – cultured and refined language; धार्यते (dhāryate) – (is held or) is upheld; क्षीयन्ते (kṣīyante) – decay; खलु (khalu) – indeed, verily; भूषणानि (bhūṣaṇāni) – ornaments; सततम् (satatam) – always; वाक् (vāk) – speech; भूषणम् (bhūṣaṇam) – ornament, decoration; भूषणम् (bhūṣaṇam) – ornament, decoration;
తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా విభజించారు.
16 అచ్చులు, 38 హల్లులు,పొల్లు, నిండు సున్స 56 అక్షరములు.
అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది.
తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.
అచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు.
అవి:
హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.
హల్లులు 38 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు ఉన్నాయి.
సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.
పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప
స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.
స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ
చ వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ
ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ
త వర్గము - త, థ, ద, ధ, న
ప వర్గము - ప, ఫ, బ, భ, మ
ఉభయాక్షరములు 3.
సున్న - దీనిని పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు ఉన్నాయి. అనుస్వరము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్నను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.
సిద్ధానుస్వారము - శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు.
సాధ్యానుస్వారము - వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము.
ఉదాహరణ: పూచెను + కలువలు = పూచెంగలువలు.
అరసున్న - దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వరము, ఖండబిందువు అని పేర్లు ఉన్నాయి. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు.
విసర్గ - ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.
హల్లుకు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం చూడండి
క్క, ఖ్ఖ, గ్గ, ఘ్ఘ, ఙ్ఙ
చ్చ, ఛ్ఛ, జ్జ, ఝ్ఝ, ఞ్ఞ
ట్ట, ఠ్ఠ, డ్డ, ఢ్ఢ, ణ్ణ
త్త, థ్థ, ద్ద, ధ్ధ, న్న
ప్ప, ఫ్ఫ, బ్బ, భ్భ, మ్మ
య్య, ర్ర, ల్ల, వ్వ, శ్శ, ష్ష, స్స, హ్హ, ళ్ళ, ఱ్ఱ.
0 Doubts's