సవర్ణదీర్ఘ సంధి: (అ/ఇ/ఉ/ఋ)కు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును. ఉదా: దేవ+ఆలయము=దేవాలయము భాను+ఉదయము=భానూదయము (భాను మొదటి పదం భానులో చివర ఉకారం ఉంది ఉదయంలో మొదట ఉకారం ఉంది భానులో నులో ఉన్న ఉకారం ఉదయంలో ఉన్న ఉకారం సవర్ణాచ్చులు కావున వీనికి దీర్ఘ ఊకారం వచ్చింది.)
గుణ సంధి:అకారమునకు (ఇ/ఉ/ఋ) పరంబగునపుడు క్రమముగా (ఏ / ఓ / ఆర్)గా ఆదేశమగును. ఉదా: చంద్ర+ఉదయము=చంద్రోదయము దేవ+ఇంద్రుడు=దేవేంద్రుడు గుణ+ఉన్నతుడు=గుణోన్నతుడు
యణాదేశ సంధి:(ఇ/ఉ/ఋ)కు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమముగా ( య / వ / ర )గా ఆదేశముగా వచ్చును. ఉదా: అతి+అంతము=అత్యంతము
వృద్ధి సంధి: అకారమునకు (ఏ/ఐ)కు పరమగునపుడు ఐ కారమును, (ఓ/ఔ)కు పరమగునపుడు ఔ కారమును వచ్చును. ఉదా: ఏక+ఏక=ఏకైక అష్ట+ఐశ్వర్యములు=అష్టైశ్వర్యములు
యణాదేశ సంధి : ఇ/ఉ/ఋ ల కు ఆసవర్ణాలు పరమైనపుడు వరుసగా య / వ / ర లు పరమవుతాయి. యణములు ఆదేశంగా వస్తున్నాయి కాబట్టి యణాదేశసంధి అని పేరువచ్చింది.
అనునాసిక సంధి:(క/చ/ట/త/ప)కు 'న - మ ' అను అనునాసికాక్షరములు పరమైనపుడు క్రమముగా ఆయా వర్గ అనునాసికాక్షరములు వికల్పముగా ఆదేశమగును. ఉదా: జగత్+నాటకము=జగన్నాటకము
జస్త్వ సంధి: వర్గ ప్రథమాక్షరములకు అచ్చులుగాని, వర్గ తృతీయ, చతుర్ధాక్షరములుగాని, హయవరలు గాని పరమగునపుడు క్రమముగా ఆయా వర్గ తృతీయాక్షరములు ఆదేశమగును. ఉదా: వాక్+ఈశ=వాగీశ.
0 Doubts's