పార్ట్ - I
పోతన నేటి వరంగల్లు జిల్లా బమ్మెర గ్రామ నివాసి.తల్లి లక్కమాంబ, తండ్రి కేసన. పోతన సహజపండితుడని ప్రసిద్ధి.
మానవమాత్రులైన రాజులకు తన గ్రంథాన్ని అంకితం చెయ్యనని, భగవంతుడిచ్చిన కవితాకళను భగవంతునికే అంకితం చేస్తానని చెప్పి తన భాగవత పురాణాన్ని శ్రీరామచంద్రునికే' అంకితం చేశాడు.
శబ్దాలంకారాల సొగసుతో భక్తిరస ప్రధానంగా ఇతని రచన సాగుతుంది. పండిత పామర జనరంజకంగా రాయడం పోతన ప్రత్యేకత. ప్రహ్లాదచరిత్ర, గజేంద్రమోక్షం, రుక్మిణీకల్యాణం, మున్నగు ఘట్టాలలోని పద్యాలు ప్రతీ తెలుగువాడికి కంఠతా వస్తాయి. పోతన రచనాశైలి, మధురభక్తి తరువాత కవులకు ఒరవడిగా నిల్చాయి. వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం ఇతని రచనలు.
ఇచ్చిన మాట తప్పకపోవటం, తాను సంపాదించిన దానిలో శక్తిమేరకు దానం చేయడం, తన యింటికి వచ్చిన అతిథి, అభ్యాగతులను ఆదరించటం అనేవి మానవులకు ఉండవలసిన మహిత గుణాలు. మన పురాణాలలో, చరిత్రలో ఇటువంటి మహనీయుల కథలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని చదివి మనం స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉన్నది.
ప్రస్తుత పాఠంలో బలిచక్రవర్తి తాను ఇచ్చినమాటకు కట్టుబడి తన గురువు వారించినా, హెచ్చరిస్తున్నా కాదంటూ 'వామనుని' కోరికమేరకు దానం చేస్తాడు.
కులమున్ రాజ్యముం దేజమున్ నిలుపు మీ కుజుండు విశ్వంభరు
డలంతి బోండు త్రివిక్రమస్పురణవాఁడై నిండు బ్రహ్మాండమున్లం
గలండ్రే మాన్ప నొకండు?నా పలుకు లాకర్ణింపు కర్ణంబులన్
వలధీ దానము గీనముం; బనుపుమా వర్ణిన్ వదన్యోతమా !
ప్రతిపదార్థం
వదాన్య + ఉత్తమా! = దాతల్లో శ్రేష్టుడా! (ఓ బలిచక్రవర్తీ)
కులమున్ = మీ వంశాన్ని
రాజ్యమున్ = మీ రాజ్యాన్ని
తేజమున్ = తేజస్సును
ఈ కుబ్జుండు = ఈ పొట్టివాడు (వామనుడు)
విశ్వంభరుండు = విశ్వమును భరింపగల్గు వాడు (విష్ణుమూర్తే)
అలాంతిన్ + పోడు = ఇంత తక్కువతో పోడు.
త్రివిక్రమ స్ఫురణవాండు+ఐ = త్రివిక్రముడంతటి వాడు (మూడు లోకములను ఆక్రమించగలవాడై)
బ్రహ్మాండమున్ = ఈ బ్రహ్మాండం అంతటినీ
నిండున్ = వ్యాపిస్తాడు
ఒకండు = మరొకడు
మాన్పన్+కలడే = తప్పింపగలుగుతాడా!
నా = నా యొక్క
పలుకులు = మాటలు
కర్ణంబులన్ = చెవులతో
ఆకర్ణింపు = విను
దానము గీనమున్ = దానం గీనం వంటివి
వలదు = వద్దు
వర్ణిన్ = ఈ బ్రహ్మచారిణి
పనుపుమా! = పంపించవయ్యా!
భావం: దాతల్లో గొప్పవాడా! ఓ బలిచక్రవర్తీ! ని కులాన్ని, రాజ్యాన్నీ, పరాక్రమాన్నీ నిలుపుకో. ఈపొట్టివాడు విష్ణువు.కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు. మూడడుగులతో మూడులోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు.బ్రహ్మాండమంతా నిండిపోతాడు.ఎవరైనా అతడిని ఆపగలరా?నా మాట విను.దానం వద్దు.జనం వద్దు.ఈ బ్రహ్మచారిని(వామనుడిని)పంపించు.
వ.ఆని యిట్లు హితంబు పలుకుచున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలిత లోచనుండయి యశస్వి యిట్లనియె.
ఇట్లు = ఈ విధముగా
హితంబు = మేలు
పలుకుచున్న = మాట్లాడుచున్న
కులాచార్యునకున్(కుల + ఆచార్యునకున్) = తన వంశ గురువైన శుక్రాచార్యునకున్
క్షణమాత్ర = క్షణకాలము
నిమీలిత = మూయబడిన
లోచనుఁడు + ఐ = కన్నులు కలవాడై
యశస్వి = కీర్తిమంతుడైన బాలి చక్రవర్తి
ఇట్లు + అనియె = ఈ విధముగా చెప్పాడు
భావం: ఆని ఈ విధముగా తన వంశ గురువైన శుక్రాచార్యుడు తన మేలును కోరి చెపుతుండగా క్షణకాలం కన్నులు మూసుకొని కీర్తిమంతుడైన బాలి ఇట్లన్నాడు.
సీ.నిజమానతిచ్చితి నీవు మహాత్మక!
మహిని గృహస్థధర్మంబు నిదియ
యర్థంబు గామంబు యశమును వృత్తియు
నెయ్యది ప్రార్దింప నిత్తు ననియు
నర్దలోభంబున నర్ధింబొమ్మనుటేట్లు?
పలికి లేదానికంటేబాప మెద్ది
'యెట్టి దుష్కర్ముని నే భరించెదనుగాని
సత్యహీనుని మేవంజాల'ననుచుఁ
తే.బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ
సమరమున నుండి తిరుగకజచ్చుకంటే
మానధనులకు భద్రంబు మణియుగలదె
మహాత్మక = ఓ మహాత్మ(శుక్రాచార్యా)
నీవు = నీవు
నిజము = సత్యాన్ని
ఆనతిచ్చితి = చెప్పావు
మహినిన్ = లోకములో
ఇదియున్ = ఇదే (నీవు చెప్పినదే)
గృహస్థ ధర్మంబు = గృహస్థులు పాటించవలసిన ధర్మము
అర్థంబున్ = ధనమునూ
కామంబున్ = కోరికయూ
యశంబున్ = కర్తియూ
వృత్తియున్ = జీవనోపాయమునూ
ఎయ్యది = ఏది
ప్రార్దింపన్ = అడిగినా
ఇత్తున్ = ఇస్తానని
అనియున్ = అనికూడ
అర్దాలోభంబునన్ = ధనముపై దురాశతో
అర్డిన్ = యాచకుని
పొమ్మనుట +ఎట్లు ? = వెళ్ళిపొమ్మనడం ఎలా?
పలికిలేదు +అనుకంటెన్ = ఇస్తానని చెప్పి లేదు అని చెప్పడం కంటె
పాపము + ఎద్ది = పాపము ఏమి ఉంటుంది?
తొల్లి = పూర్వము
భూదేవి = భూమాత
ఎట్టి + దుష్కర్ముని = ఎంత చెడ్డపని చేసిన వానినైనా
నేన్ + భరించెదన్ = నేను భరిస్తాను
కాని = అంతేగాని
సత్యహీనునిన్ = సత్యము పలుకని వానిని
మోవజాలన్ + అనుచున్ = మోయలేనని
బ్రహ్మతోడన్ = బ్రహ్మదేవునితో
పలుకదె = చెప్పలేదా?
సమరమున నుండి = యుద్దములో నుండి
తిరుగక = వెనుదిరుగకుండా
చచ్చుకంటె = వీరమరణం పొందడం కంటె
పలికి బొంకక = మాటకు కట్టుబడి
మానధనులకున్ = అభిమానమె ధనముగా కలవారికి
భద్రంబు = శుభప్రదమైనది (మంచిది)
మణియున్ + కలదె = మణియొకటి ఉంటుందా? (ఉండదు)
భావం: ఓ మహాత్మా!నీవు చెప్పింది నిజమే లోకం లో గృహసుల ధర్మము కొద అదే .అర్థం కామం ,కీర్తి జీవనాధారం వీటితో ఆది అడిగిన ఇస్తానని చెప్పాను .ఎప్పుడు ధనపైనా దురాశతో లేదని చెప్పి త్రిప్పి పాపమిచలేను మాట తప్పుటకన్నా పాపం లేదు .పూర్వము భూదేవి ఎటువంటి చెడ్డపని చేసిన వారినైనా భరిస్తాను కాయాన్ని అడిగిన మాట తప్పినవానిని మాత్రం మోయలేని అని బ్రహ్మతో చెప్పింది కదా !
యుద్ధం లో వెనుదీరగకుండా వీరమరణం పొందడమూ మాటకు కట్టుబడి సత్యం తో బ్రతకడమూ మానవధనులైన వాళ్లకు మేలైన మార్గములు .
ధాత్రిని హాలికునకును సు
క్షేత్రము బీజములు నొకట జేకురు భంగి
జిత్రముగా ధాత కివియు
భత్రము సముకూరునట్టి భాగ్యము గలదే!
ధాత్రిన్ = భూమండలంలో
హాలికునకున్ = రైతుకు
సుక్షేత్రమున్ = మంచి పొలమునూ
ఒకటన్ = ఒకేచోట
చేకుఱుభంగిన్ = దొరికిన విధముగా
చిత్రముగన్ = మనోజ్ఞముగా
దాతకున్ = దానము చేసేవానికి
ఈవియున్ = దానము చేసే గుణమునూ
పాత్రమున్ = దానిని తీసుకునే ఉత్తముడునూ
సమకూరునట్టి = దొరకునట్టి
భాగ్యము = అదృష్టము
కలదే = ఉన్నదా?
భావం: రైతులకు మంచి నెల మంచి విత్తనాలు దొరకటం అరుదు .అట్లే దాతకు ధనము,దానిని గ్రహించటానికి ఉత్తముడైన వ్యక్తి దొరికే అదృష్టం కదా !
0 Doubts's