ప్రతి పాఠానికి సంబంధించిన కవి/ రచయిత గురించిన విశేషాలపై అవగాహన కలిగి ఉండడం అవసరం. కవి గురించి తెలుసుకునేటప్పుడు రెండు విభాగాలు ముఖ్యమైనవే. 1) జీవిత విశేషాలు 2) సాహితీవిశేషాలు.
జీవిత విశేషాల్లో జననం, తల్లిదండ్రులు, రచనలు, పురస్కారాలు తదితరాంశాలుంటాయి.
సాహితీ విశేషాల్లో రచనలు, రచనాశైలి, భాష, అలంకారాలు, ప్రత్యేకతలు ఉంటాయి.