పార్ట్ - I
1. శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్.
2. కనకమ్మ, నరహరిస్వామి దంపతులకు జన్మించారు.
3. ఈయన రంగారెడ్డి జిల్లాలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేసారు.
4. ఈయన రాసిన విమర్శనావ్యాసాలు "స్రవంతి" పత్రికలో ప్రచురించబడ్డాయి.
5. దైవభక్తి, దేశభక్తి గేయాలను రాసారు.
పల్లవి:
వందనాలు వందనాలు
అభినందన చందనాలివే
మా అభినందన చందనాలివే
శ్రమదాచని హాలికులకు
తలవంచని సైనికులకు
భరతమాత పురోగతికి
ప్రాతిపదికలగు ఘనులకు ||వంద||
సారాంశం: రైతులకు సైనికులకు వందనాలు.మెచ్చుకోవడం అనే చందనాలను వాళ్లకు సమర్పిస్తునాం. కష్టాన్ని దాచుకోని రైతులకు, ఎవరికీ తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలాలైన వీరికి వందనాలు,అభినందనలు.
పుడమితల్లి పులకింపగా
రుధిరం స్వేదమ్ము కాగా
పసిడిని పండించునట్టి
ప్రగతి మార్గదర్శకులకు ||వంద||
సారాంశం: నేలతల్లి సంతోషపడేటట్టుగా, నెత్తురు చెమటగా మారుతుండగా, బంగారాన్ని పండిస్తూ, అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు.
1 Doubts's
??????? ??????? ???? ??????