Home SSC 6th Class తెలుగు ( 6 వ తరగతి )

పార్ట్ - IV వ్యాకరణం

6.పోతన బాల్యం వ్యాకరణం

ఇవి చేయండి

I. విని అర్ధం చేసుకొని, అలోచించి మాట్లాడడం

ఈనాటి కాలంలో సోదరుల మధ్య ప్రేమ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు ? విశ్లేషించండి.

జ. ఈనాటి కాలంలో సోదరుల మధ్య ప్రేమ పూర్వం లాగా ఉండడం లేదు. ప్రతి విషయం డబ్బుతో ముడిపడి ఉంటుంది. డబ్బుకోసమో లేదా ఆస్థి కోసమో వాదులాడుకుంటూ ఉంటారు. రక్త సంబంధం కంటే ధనమే ప్రధానంగా భావిస్తున్నారు. అందువల్ల అన్నదమ్ముల అనుబంధం దూరమైపోతున్నది.

II. ధారాళంగా చదువడం - అర్డంచేసుకొని, ప్రతిస్పందించడం

1. 'ఈ చిన్నబాలుడు అసాధ్యుడు' అనే భావం వచ్చే పద్య పంక్తి ఏది ? ఆ పద్యాన్ని దాని భావాన్ని రాయండి?

జ. ఈ చిన్నబాలుడు అసాధ్యుడు అని భావం వచ్చే పంక్తి:

"చిఱుత డసాధ్యుడంచు నెద జే యిడి విస్మయమందు నందఱున్"

ఈ 'చిన్నబాలుడు అసాధ్యుడు' అని భావం వచ్చే పద్య పంక్తి:

పద్యం: గురినిడి కొట్టెనేని యొక గోలియు దప్పదు కచ్చగట్టి బొం

          గరమును వేయ వ్రేటు కొక కాయ పటుక్కను, బందెమూని తా

          నుఱికిన లేడిపిల్లవలె నొక్కని యయ్యకు జిక్కడద్ధిరా!

          చిఱుత డసాధ్యుడంచు నెద జే యిడి విస్మయమందు నందఱున్.

భావం: గురిచూసి కొట్టాడంటే ఒక్క గోలికూడా గురితప్పదు.పోటీపడి బొంగరాన్ని విసిరితే వేటువేటుకు ఇతరుల బొంగరాలు 'పటుక్కని' పగులవలసిందే. పందెం పెట్టుకొని పరుగెత్తాడంటే లేడిపిల్లవలె ఏ ఒక్కనికీ చిక్కడు. దాన్ని చూసి అదిరా! ఈ చిఱుతడు అసాధ్యుడు సుమా! అంటూ అందరూ గుండెలమీద చేయి వేసుకుని ఆశ్చర్యపోతారు.

2. కింది పద్యం చదువండి. భావంలోని ఖాళీలు పూరించండి.

ఖాళీలు :

అ)కింద పడ్డా పైకి లేచేవాడు 

జ. సుజనుడు

ఆ)అపజయం పాలైనా తిరిగి సాధిస్తాడు 

జ. విజయం

ఇ)మందుడు అంటె 

జ. మూర్ఖుడు

ఈ)బంతిలో పోల్చబడినవాడు 

జ. సుజనుడు

ఉ)'మట్టిముద్ద' అనే పదానికి పద్యంలో వాడబడిన పదం

జ. మృత్పిండము

III.స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ)ఊళ్ళోని పెద్దలందరూ అన్నదమ్ములిద్దరినీ మెచ్చుకునేవారట. మీ చుట్టుపక్కలవారు నిన్ను మెచ్చుకునేటట్లుగా నీవు ఏం చేస్తావు?

జ. నేను నా తమ్ముడిని చాలా ప్రేమగా చూస్తాను. నాకు తినడానికి ఎవరైనా ఏదైనా ఇస్తే తమ్మునికి ఇవ్వకుండా తినను. ఆటవస్తువులు కూడా నా తమ్మునికి ఏది కావాలంటే ఏది నా దగ్గరున్నది ఇస్తాను. తినేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడ్ని న పక్కనే ఉంచుకుంటాను. అన్నదమ్ములంటే ఇలా ఉండాలని మా చుట్టుపక్కలవారు నన్ను మెచ్చుకునేటట్లుగా వ్యవహరిస్తాను.

ఆ)'కాళ్ళలో పాదరసం' అంటే మీకు ఏమి అర్ధమయింది?

జ. పాదరసం ఒకచోట నిలకడగా ఉండదు. అది జారిపోతుంది. అలాగే కొందరు ఒకచోట స్థిరంగా ఉండకుండా ఎప్పుడు ఏదో ఒకచోటికి తిరుగుతూ ఉంటారు. వారికీ భూమి పైన క్షణమైనా కాలు నిలువదు. అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని లోకులు ఆ 'కాళ్ళలో పాదరసం' ఉందనే జాతీయాన్ని వాడతారని అర్థమైంది.

ఇ)'తిప్పన - పోతన' లను రామలక్ష్మణులతో ఎందుకు పోల్చారు?

జ. రామలక్ష్మణులు ఆదర్శవంతమైన సోదరులు. ఒకరిని విడిచిపెట్టి మరొకరు ఉండరు. కష్టసుఖాలలో కలిసిమెలిసే ఉంటారు. ఆ అన్నదమ్ములిద్దరూ గొప్పగుణాలు కలవారు. అలాగే 'తిప్పన-పోతన' లు కూడా ఆదర్శ సోదరులు. ఒకరంటే మరొకరికి గౌరవము.రామలక్ష్మణులు వాలే వీరుకూడా ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలతో మెలిగేవారు. అందువల్ల 'తిప్పన-పోతన' లను రామలక్ష్మణులతో పోల్చారు.

ఈ)పాఠం ఆధారంగా కవి గురించి రాయండి?

జ.  1.పోతన బాల్యం అనే పాఠం రాసిన కవి డా|| వానమామలై వరదాచార్యులు.
          2.ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ గ్రామంలో జన్మించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిరనివాసం                  ఏర్పరచుకున్నారు.
          3.బిరుదులు: అభినవ పోతన , అభినవ కాళిదాసు, మధురకవి, కవిచక్రవర్తి మొదలైనవి.
          4.ఈయన రచించిన గ్రంధాలు: పోతన చరిత్రము, మణిమాల , సక్తి వైజయంతి, జయధ్వజం, వ్యాసవాజి, కూలిపోయే                 కొమ్మ, రైతు బిడ్డ (బుర్రకథల సంపుటి)
          5.పురస్కారాలు: ఆంధ్రప్రదేశ్ సహత్య అకాడెమి పురస్కారం, వారణాసి వారి విద్యావాచస్పతి మొదలైన పురస్కారాలు                  అందుకున్నారు.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

పోతన బాల్యాన్ని మీ సొంతమాటల్లో రాయండి.

జ. పోతనకు తన అన్న తిప్పని అంటే అమితమైన గౌరవం. తిప్పని ఏదైనా పద్యాన్ని చదువుతుంటే,పోతన దానిని ఒక్కసారి వినగానే అర్ధం చేసుకునే వాడు. ఆ పద్యంలోని సారాంశాన్ని వెంటనే చెప్పగలిగేవాడు. అయన బాల్యం నుండే గొప్ప తెలివితేటలూ గలవాడు.
                  పోతన ఆటల్లో ఆరితేరినవాడు. చదువుల్లో అతనికి అతడే సాటి. మంచి శక్తిమంతుడు.తియ్యగా పాటలు పాడేవాడు. మొగమాటం, భయం, వెనుకడుగు వేయడమంటూ ఎరుగనివాడు. కోతివలె చెట్లకొమ్మలు ఎగబాకేవాడు. పక్షి వలె కిందికి దూకేవాడు. ఆయనకు భూమి మీద కాలు క్షణమైనా నిలిచేది కాదు.
                        అమ్మ గుడికి పోతుంటే పోతన బడికి పోకుండా గుడికి పోయేవాడు. గుడిలో దేవుడికి మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేసేవాడు. పోతన సాధు సజ్జనులను దర్శించాలని ఉత్స్తాహం కలవాడు. హరికథలను. పురాణాలను వినాలనే కోరిక ఆయనకు చిన్నప్పుడే మొదలైంది. శివపూజ చేయాలనే ఆసక్తి కూడా ఏర్పడింది.

IV. సృజనాత్మక/ ప్రశంస

1.పోతన తన బాల్యంలో ఆడుకొనే ఆటలు తెలుసుకున్నారు కదా! అట్లాగే మీరు ఆడుకొనే ఆటలు ఏవి? ఆటలు ఎందుకోసం ఆడాలో, వాటి ప్రాముఖ్యత ఏమిటో వివరిస్తూ వ్యాసం రాయండి.

జ. నేను ఆడుకునే ఆటలు : 1) గోళీలాట 2) కబడ్డీ 3)రింగ్ అట (టెన్నికాయిట్) 4) క్యారంస్ 5) ఖో - ఖో

ఆటలు ఎందుకోసం ఆడాలంటే : మనోవికాసానికీ అవి బాగా సహకరిస్తాయి. రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ఆరయోగ్యం బాగుంటుంది. సమయస్ఫూర్తి అలవడుతుంది.
ఆటలా ప్రాముఖ్యత : ఆటలు , నాయకత్వ లక్షణాలను పెంచుతాయి. ఆటలవల్ల సహనం, పట్టుదల, పరస్పర సహకారం, పోటీతత్వం, సమిష్టి బాధ్యత మొదలైన గుణాలు అలవడతాయి.

                                                                           (లేదా)

2.పోతన ఆడుకునేటప్పుడు చూసినవాళ్లు "ఈ బాలుడు అసాద్యుడు." అని అనుకునేవారుకదా! మరి ఇప్పుడు ఆడుకొనే పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారో ఉహించి సంభాషణలు రాయండి.

జ. రామయ్య : కొటయ్యా! ఆ పిల్లల్ని చూడు. రోడ్డు మీదే కర్రాబిళ్ళ ఆట ఆడుతున్నారు. ఆటస్థలానికి వెళ్లి ఆడుకోవచ్చు కదా!
        కొటయ్య   : అవును. రోడ్డు మీద పోయేవారికి ఆ కర్రాబిళ్ళ వచ్చి తగులుతుందని కూడా ఆలోచించరు.
        రామయ్య  : రోడ్డుమీద వాళ్ళకే కాదు. అది వాళ్లకు తగిలిన ప్రమాదమే.
        కొటయ్య   : నిజమే ! మొన్న ఇలాగె ఆడి ఒక పిల్లవాడు కన్ను పోగొట్టుకున్నాడు.
        రామయ్య  : అది చూసి అయినా మిగతావాళ్ళు ఆ ఆట ఆడడం మానరు కదా!
        కొటయ్య   : ప్రమాదం లేని ఆటలు చాలా ఉన్నాయి. వాటిని ఆడుకోవచ్చు కదా!
        రామయ్య  : వాళ్ళు అసాధ్యులు. ఎవరి మాటా వినరు.

V. పదజాల వినియోగం

1. కింది వాక్యాల్లో గీత గీసిన పాదాలకు అదే అర్ధం వచ్చే పదాలను పటంలో వెతికి రాయండి.

అ)లక్ష్మి పుస్తకాన్ని తెరిచి పాఠం చదివింది.

జ. పోతాము
ఆ)అర్జునుడు విలువిద్యయందు అధిపుడు.

జ. గొప్ప
ఇ)బలరాముని సోదరుడు శ్రీకృష్ణుడు.

జ. తమ్ముడు
ఈ)ప్రతిరోజు స్నానం చేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.

జ.మై

2. కింది పట్టికలో ప్రకృతి - వికృతి పెద్దలను జతపరచండి.

అ) జ. భోజనం - బోనం
ఆ) జ. నిదుర - నిద్ర
ఇ) జ. పోతాం - పుస్తకం

3. కింది పదాలతో సొంతవాక్యాలు రాయండి.

అ) జ. అనుజుడు : మా అనుజుడు చిత్రలేఖనంలో ఆరితేరినవాడు.
ఆ) జ. గొంకుజంకులు : కొందరు గొంకుజంకులు లేకుకండా ధైర్యంగా అడవుల్లో విహరిస్తారు.
ఇ) జ. మేటి : మా సోదరి నృత్య ప్రదర్శన లో మేటి.
ఈ) జ. ఆసక్తి : నాకు హాస్య నాటికలంటే ఆసక్తి ఎక్కువ.
ఉ) జ. వెత : దేశ రక్షణ కోసం సైనికులు ఎన్నో వెతలు ఎదుర్కొంటారు.
ఊ) జ. అసాధ్యుడు : అసాధ్యుడైన ఆ అధికారి ఎవరి మాటా వినడు.

4. కింది వాక్యాలను చదువండి. ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్ధం వచ్చే మరికొన్ని పదాలున్నాయి. వాటికింద గీత గీయండి.

అ) జ. పురం = పట్టణం, నగరం
ఆ) జ. ధరణి = పుడమి, అవని
ఇ) జ. కోతి = కపి, వానరం
ఈ) జ. గుడి = కోవెల, దేవాలయం

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పట్టికలో పదాలను చదివి, పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ పదాలను, ఏకవచన - బహువచన అవ్యయాలను గుర్తించండి.

అ) జ. పుంలింగ పదాలు        : బాలుడు, బాలురు, సుధాకర్, బలరాం.
ఆ) జ. స్త్రీలింగ పదాలు         : సీత, మహిళలు, రచయిత్రి, ఆమె. 
ఇ) జ. నపుంసకలింగ పదాలు  : పుట్ట, బొమ్మ, ఆకాశం, చంద్రుడు, చుట్టూ, డబ్బ, పత్రిక, బల్ల. 
ఈ) జ. ఏకవచనం                : బాలుడు, బొమ్మ, నటి, చంద్రుడు.
ఉ) జ. బహువచనం              : బాలురు, ఆటలు, మహిళలు, రచనలు. 
ఊ) జ. అవ్యయం                 : ఆహా, ఆమ్మో, శబాష్, అట్లాని.

2. కింది వాటిని జతపరచండి

అ) జ. నామవాచకం - హైదరాబాద్
ఆ) జ. సర్వనామం - ఆమె
ఇ) జ. విశేషణం - ఎర్రని
ఈ) జ. క్రియ - చదివింది
ఉ) జ. అవ్యయం - కాని

3. కింది ఖాళీలను పూరించండి.

అ)నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది

జ. విశేషణం
ఆ)నామవాచకానికి బదులుగా వాడేది 

జ. సర్వనామం
ఇ)పనిని తెలిపే మాట 

జ. క్రియ
ఈ)లింగవచనవిభక్తులు లేనిది 

జ. అవ్యయాలు
ఉ)పేరును తెలిపే పదం 

జ. నామవాచకం