Home SSC 6th Class తెలుగు ( 6 వ తరగతి )

పార్ట్ II

11. పల్లెటూరి పిల్లగాడా! - పార్ట్ - II

పద్యాలు

పెందలాడ అమ్మనీకు

పెట్టలేదా సద్దికూడు

ఆకలిగొని అడలుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ

అడవి తిరిగి అలిసి పోయావా

సారాంశం: పొద్దున్న అమ్మ నీకు సద్ది అన్నం పెట్టలేదా? అడవిలో తిరిగి తిరిగి ఆకలితో అలసిపోయావా?


ఆకుతేళ్లు కందిరీగలు

అడవిలో గల కీటకాదులు

నీకేమైన కాటువేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ

నిజాము దాచక నాతో చెప్పేవా

సారాంశం: అడవిలో ఆకుతినే పురుగులో, కందిరీగలో లేదా ఇతర కీటకాలో నిన్నేమైనా కుట్టాయా? నిజమెంతో నాకు చెప్పవా?


మాయదారి ఆవుదూడలు

మాటిమాటికి కంచె దుంకీ

పంట చేలూ పాడు చేశాయా ఓ పాలబుగ్గల జీతగాడ

పాలికాపు నిన్నే కొట్టాడా

సారాంశం: మాయదారి ఆవుదూడలు మాటిమాటికి కంచెపై నుండి దూకి వేరే వాళ్ళ పంటపొలాలను పాడుచేశాయా? అది చుసిన ఆ కావాలిమనిషి నిన్ను కొట్టాడా?


నీకు జీతం నెలకు కుంచం

తాలు వరిపిడి కల్తిగాసం

కొలువుగా సేరు తక్కువ వచ్చిందా ఓ పాలబుగ్గల జీతగాడ

తలుచుకుంటే దుఃఖ మొచ్చిందా

సారాంశం: నీకు నెల జీతం కుంచెడు వడ్లు. నీకు కొలిచిన జీతం వడ్లలో తాళువడ్లు, పొట్టు, కల్తీవడ్లు ఉన్నాయా? అవి కొలిస్తే సేరు తక్కువగా ఉన్నాయా? అది తలుచుకుని ఏడుస్తున్నావా?


పాఠశాల ముందుచేరి

తోటి బాలుర తొంగి చూసి

ఏటికోయీ వెలవెల బోతావు ఓ పాలబుగ్గల జీతగాడ

వెలుగులేని జీవితమంటావా

సారాంశం: బడి ముందర నిలబడి, బడిలో చదివే నీ ఈడుపిల్లలను చూసి, ముఖాన్ని ముడుచుకున్నావు. బడికి పోలేని నీ బతుకును తలుచుకుంటూ ఏడుస్తున్నావా? జీవితంలో వెలుగు లేదని భాదపడుతున్నావా?