Home SSC 7th Class తెలుగు (7వ తరగతి)

: పార్ట్ - I

9. ఏ కులం? పార్ట్ - I

కవి పరిచయం: (03.01.1944 - 02.07.1982)

  1. కవి : చెరబండ రాజు. 

  2. అసలు పేరు : బాదం భాస్కరరెడ్డి. 

  3. కాలం : 1944 - 1982.

  4. జన్మస్థలం : మేడ్చెల్ జిల్లాలోని అంకుషాపురం. 

  5. ఇతర రచనలు: గమ్యం, ముట్టడి, పల్లవి, కతిపాట. 

    పద్యాలు

ఏ కులమబ్బీ!

మా దేమతమబ్బీ!!

మట్టి పిసికి ఇటుక చేసి

ఇల్లు కట్టి పెట్టినపుడు

డొక్కా లెండి కొండ్ర లేసి

ధాన్యరాశులెత్తినపుడు || ఏ ||

సారాంశం :
మట్టిని మెత్తగా తొక్కి పిసికి, ఇటుకలను తయారుచేసి, ఇల్లుకట్టేవారిది ఏ కులం? కడుపు మాడ్చుకొని , దున్నిన చాలులో పంటను పండించి , ధాన్యరాశులను బస్తాలకు ఎత్తినపుడు రైతుదేకులం?! ఏమతం?

పొగగొట్టాలై పేగులు

కొలిమి సెగలు చిమ్మినపుడు

దగ్గులతో క్షీణిస్తూ

బొగ్గుట్టలు త్రవ్వినపుడు || ఏ ||

సారాంశం :
ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆ కొలిమి సెగలు తగిలి పేగులు మాడిపోతున్నాయి. బొగ్గు గుట్టలను తవ్వినపుడు దుమ్ము ధూళి వాళ్ళ దగ్గుతో కార్మికుని ఆరోగ్యం క్షీనిస్తుంది. వీరిది ఏ కులం?! ఏమతం?!

మాడు చెక్కలే తింటూ

మాగాణం దున్నినపుడు

ఎండలలో బండలపై

విగ్రహాలు చెక్కినపుడు || ఏ ||

సారాంశం :
మాడిన అన్నం తింటూ కూడా నేలను దున్నుతూ వరిపంటలను పండించే రైతుది ఏ కులం? మండే ఎండలో బండలను అందమైన ఆకృతులలో విగ్రహాలను చెక్కిన శ్రమజీవి శిల్పిది ఏ కులం?! ఏమతం?!