Home SSC 7th Class తెలుగు (7వ తరగతి)

:పార్ట్ - I

1.చదువు పార్ట్ - I

కవి పరిచయం:

  1. కొఱవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబికా, కొఱవి కసవరాజు.
  2. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ ప్రాంతంవాడు.
  3. నాటి పళ్ళికొండ సంస్థానాధీశుడు, మహారాజు రానా మల్లన ఆస్థాన పండితుడు.
  4. సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాలలో ప్రావీణ్యుడు.
  5. అందరికి సులభంగా అర్ధమయ్యే విధంగా కధలు చెప్పడం ఈయన ప్రత్యేకత.

పద్యాలు

ఆ.వె|| భట్టి మంత్రి; సైన్యపాలి గోవింద చం
         ద్రుఁడు; త్రివిక్రముడు పురోహితుండు;
         నప్పారోహితునకు నాత్మజుండగు కమ
         లాకరుండన నావివేకి గలఁడు.

తాత్పర్యం: విక్రమార్క మహారాజుయొక్క మంత్రి భట్టి, ఆ రాజు వద్ద గోవిందాచంద్రుడనే సైన్యపాలకుడున్నాడు. విక్రమార్కుని పురోహితుడు త్రివిక్రముడు. ఆ పురోహితునికి కమలాకరుడనే కొడుకున్నాడు. అతడు అవివేకి.

కం|| ఆ కమలాకరుఁ డా కమ
లాకర్ సాదృశ్యముగా జడాశయుఁడై నన్
శోకము మదిఁ బొదలంగా వి
వివేకము పుట్టింపఁ దండ్రి వేరవున దూఱెన్.

తాత్పర్యం: కమలాకారం అంటే జలాశయం. అది నిశ్చలంగా ఉంటుంది. ఆ విధంగానే కమలాకరుడు జడశయుడు. ఎటువంటి ఆశయం లేకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. కొడుకుని చూసి తండ్రి మనసులో దుఃఖించాడు. కొడుకుని వివేకిని చేయాలనీ ఈ విధంగా మందలించాడు.

కం|| చుట్టములకుఁ దలిదండ్రుల
       కెట్టి ఎడం బ్రియము నెరపనేడపని చదువుల్
       గట్టిగ నెఱుఁగని పుత్రుఁడు
       పుట్టుట కులమునకుఁదెవులు పుట్టుటచుమ్మి.

తాత్పర్యం: చుట్టాలకు తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే చదువులు పిల్లలు నేర్చుకోవాలి. అటువంటి చదువులు నేర్వని కొడుకులు వంశానికి తెగులు వంటి వారు.

కం|| విను ముత్తమమగు పుట్టువు
       గనుపట్టేడు నాట్టిరూపు గల మోదుగుఁ బూ
       వును మూర్ఖుండును బ్రబలేడు
       వనమున భవనమునఁ దగిన వాసన గలదే.

తాత్పర్యం: చక్కని రూపం ఉన్న కూడా మోదుగుపువ్వు సువాసనలు వెదజల్లలేదు. అట్లాగే ఉత్తమమైన జన్మ, ఎంత మంచి రూపమున్నవాడైనప్పటికీ మూర్ఖుడు కుటుంబంలో వెలుగుని నింపలేడు.