పార్ట్ - V వ్యాకరణం
I విని,అర్ధం చేసుకొని,అలోచించి మాట్లాడడం
1.ఏదైనా సాధించాలంటే పట్టుదల,దృఢ సంకల్పం అవసరం.దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి.
జ. జీవితంలో ఏదైనా సాధించాలన్నా ,ఏదైనా ఒక పని చేయాలన్నా ,అందుకు తగిన సమర్థత అవసరం.అయితే సమర్థత ఉన్నంత మాత్రాన అన్ని పనులు చేయలేం,అన్నింటిని సాధించలేం.సమర్ధతకు తగిన సాధన,నిరంతర శ్రమ తోడైనప్పుడు ఆశించిన గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క విధమయిన సమర్థత నిక్షిపాతం అయి ఉంటుంది.ఒక వ్యక్తి బాగా పాడగలుగుతాడు.ఇంకొక వ్యక్తిలో మంచి కవిత్వం రాయగల శక్తి ఉంటుంది.మంచి వ్యక్తిత్వం ఉంటుంది.మరొక వ్యక్తిలో చిత్రలేఖన నైపుణ్యం దాగి ఉంటుంది.వారి వారి శక్తిసామర్ధ్యాలను గుర్తించి పట్టుదలతో కృషి చేస్తే ఆయా రంగాలలో పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోగలుగుతారు.
సామర్థ్యం అనేది వ్యక్తిలో అంతర్గతంగా ఉంటుంది.దానిని గుర్తించి సాధన చేసి అభివృద్ధిని సాధించాలి.అంతే తప్ప బయటకు కనిపించే వస్త్రధారణ వంటి ఆడంబరాలు వలన కుర్చీలు,బెంచీలు పరికరాల వలన లేని సామర్థ్యం రాదు, పెరగదు."సాధనమున పనులు సమకూరు ధరలోన" అన్న వేమన మాటలు గుర్తుపెట్టుకొని మసలుకోవాలి.
1.కింది వాక్యాలు పాఠంలోని ఈ పేరాలో ఉన్నవో గుర్తించి,పేరుకు శీర్షికను పెట్టండి.
వాక్యం పేరా సంఖ్య శీర్షిక
పడవలో రిసెప్షన్ రూమ్ కూడా ఉంటుంది.
నేను ధోవతి షేర్వానీతో ఉంటిని.
ఏవేళ ప్రాణం పోతుందో.
మేము పడవ నుండి దిగేవరకు సూర్యాస్తమయం
అయింది.
జ. వాక్యం | పేరా సంఖ్య | శీర్షిక |
పడవలో రిసెప్షన్ రూమ్ కూడాఉంటుంది. | 5 |
సమాచార గది |
నేను ధోవతి షేర్వానీతో ఉంటిని. | 9 | వాగ్భూషణం |
ఏవేళ ప్రాణం పోతుందో. | 1 | ప్రాణభయం |
మేము పడవ నుండి దిగేవరకు సూర్యాస్తమయం | 19 | ఈశ్వరానుగ్రహం |
2.కింది పేరును చదివి,ప్రశ్నలకు జవాబులు రాయండి.
హైదరాబాద్ నుండి నేను రైలులో బాసర రైల్వేస్టేషన్ కు చేరుకున్నారు.అక్కడి నుండి బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతి దేవి ఆలయానికి చేరుకున్నాను.ఆధ్యాత్మికత విలసిల్లే ప్రశాంత సుందర ప్రదేశంలో,గోదావరినది తీరాన ఈ సుందర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉన్నది.
ఇక్కడి సరస్వతీదేవి సైకతమూర్తిని వ్యాసమహర్షి మలిచాడని ప్రసిద్ధి.ఈ వాగ్దేవతా సమక్షంలో వసంతపంచమిరోజు పిల్లలకు విద్యాబ్యాసం చేయిస్తే మంచి విద్యావంతులు అవుతారని ప్రతీతి.దసరా పండుగ రోజుల్లో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు.ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవతార మూర్తిగా అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రోజుల్లో భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు .ఈ పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నది.
అ)బాసర పుణ్యక్షేత్రంలోని దేవత ఎవరు ?
జ.బాసర పుణ్యక్షేత్రంలో వెలసిన దేవత శ్రీ జ్ఞాన సరస్వతీదేవి.
ఆ)సరస్వతీదేవి ఆలయం ఏ నది తీరాన ఉన్నది ?
జ. సరస్వతీదేవి ఆలయం గోదావరి నదీ తీరాన ఉన్నది.
ఇ)సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు ఎవరు?
జ.సరస్వతీదేవి సైకతమూర్తిని మలచినవారు వేదవ్యాస మహర్షి.
ఈ)నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి?
జ.నవరాత్రి ఉత్సవాలు దసరా పండుగ రోజుల్లో జరుగుతాయి.
ఉ)పై పేరాకు శీర్షిక సూచించండి.
జ. పై పేరాకు 'బాసర పుణ్యక్షేత్రం' అనే శీర్షిక తగినది.
1.కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ)దూరప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
జ. దూరప్రయాణాలకు పోయేటప్పుడు ప్రయాణికులు కనీస జాగ్రత్తలను తీసుకోవాలి.దీనివల్ల ప్రయాణం సుఖవంతంగాను,ఆరోగ్యప్రదంగాను,ఆనందమయంగాను ఉంటుంది.వాటిల్లో కొన్ని -
1)ప్రయాణపు రోజులకు అవసరమైన బట్టలను,నిత్యము ఉపయోగించే నూనె,సబ్బులు మొదలైన వాటిని దగ్గర ఉంచుకోవాలి.
2)దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ముందస్తుగా కొన్ని మందులను దగ్గర ఉంచుకోవాలి.
3)శీతల ప్రాంతాలకు వెళ్లేవారు,దానికి తగ్గట్టుగా బట్టలను సిద్ధం చేసుకోవాలి.
4)రాకపోకలకు సంబంధించిన రిజర్వేషన్ ముందుగానే చేయించుకోవాలి.
5)నిత్యావసరాలు తీరడానికి అనువుగా కొంత డబ్బును,బ్యాంకు కార్డులను దగ్గర ఉంచుకోవాలి.
6)విలువైన బంగారు ఆభరణాలను ధరించకూడదు.
ఆ)రచయిత ఉన్నతవిద్య కోసం పట్టుదలతో ఇంగ్లాండు వెళ్ళాడు కదా ! దీని ద్వారా మీరేం గ్రహించారు ?
జ. రచయిత ఉన్నతవిద్యను చదువడం కోసం పట్టుదలతో ఇంగ్లాండుకు వెళ్ళాడు.మానవునికి పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధ్యమౌతుందని గ్రహించాను.జీవితంలో చదువు చాలా గొప్పది.దానిని ప్రతి మానవుడు కష్టపడి సాధించాలి.పేదరికం చదువుకు ఆటంకం కాదని,పట్టుదల ఉంటే ఏ అవరోధం ఏమి చేయలేదని గ్రహించాను.చదువనేది ప్రయత్నం చేసేవానికి సిద్ధిస్తుందని రచయిత అనుభవం ద్వారా తెలుసుకున్నాను.
ఇ)"ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు" వివరించండి.
జ.మానవ జీవితం చాలా దుర్లభమైంది.దాన్ని మానవుడు సార్ధకం చేసుకోవాలి.జీవితంలో ఏదైనా సాధించాలన్న,ఏదైనా ఒక పని చేయాలన్న అందుకు తగిన లక్ష్యం ,దానికి మించిన పట్టుదల ఉండాలి.కేవలం లక్ష్యం ఉన్నంత మాత్రాన అన్ని పనులను చేయలేము.అన్నింటిని సాధించలేము.లక్ష్యానికి తగిన సాధన,నిరంతర పరిశ్రమ తోడైనప్పుడు ఆశించిన గమ్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.ఈ కారణాలవల్ల జీవితంలో ఉన్నత లక్ష్యం,పట్టుదలతో దేనినైనా సాధించవచ్చు అనే నిజాన్ని గ్రహించాలి.
ఈ)ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడ తెలియని విషయాలను తెల్సుకోవడానికి మీరేం చేస్తారు?
జ.ఒక కొత్త ప్రదేశాన్ని సందర్శించాలనుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.దీనివల్ల దర్షింపదలచిన ప్రాంతంలోని విశేషాలను సులభంగా తెలుసుకోగలుగుతాము. దర్శించిన ప్రాంతంలో ఒక గైడును ఏర్పాటు చేసుకుంటాను.ప్రత్యేక వాహనాన్ని కూడా దగ్గర ఉంచుకుంటాను.గైడు సహాయంతో అక్కడి విశేషాలను, వింతలను, స్థలము యొక్క గొప్పదనాన్ని తెలుసుకుంటాను.లేదా మనకు తెలిసిన బంధువులను,మిత్రులను ముందుగా సంప్రదించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా విశేషాలను తెలుసుకుంటాను.దర్శించిన ప్రాంతానికి చెందిన పుస్తకాలను చదివి మరికొన్ని విశేషాలను తెలుసుకుంటాను.ఈ రకంగా దర్శించిన ప్రాంతానికి చెందిన విశేషాలను తెలుసుకుంటాను.
2.కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ)"అనుకున్నది సాధించటంలో కలిగే తృప్తి అనంతమైంది."ముద్దు రామకృష్ణయ్య సముద్ర ప్రయాణం ఆధారంగా వివరించండి.
జ. కరీంనగర్ జిల్లా మంథని గ్రామస్థుడైన ముద్దు రామకృష్ణయ్యగారు పట్టుదలకు మారు పేరుగా నిలిచాడు.ఉన్నత లక్ష్యసాధన కోసం ఎన్నో అడ్డంకులను,ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.వాటిని తన ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని లక్ష్యాన్ని చేరుకున్నాడు.అందరికి మార్గదర్శకుడిగా నిలిచాడు.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రామకృష్ణయ్య లండనుకు వెళ్ళి చదువుకోవాలనుకున్నాడు.కష్టాలు ఎదురౌతాయని ముందుగానే గ్రహించాడు.తాను పేదరికంతో ఉన్నా దానిని లెక్కపెట్టలేదు.బొంబాయి (ముంబయి)లో పడవ ఎక్కాడు.పడవలోని వాతావరణం మొదట్లో ఇబ్బందిగా ఉంది.లండన్ లో ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళకు మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుందని,లేకపోతే తిరిగి పంపిస్తారని తెలుసుకున్నాడు.దైవాన్ని ప్రార్ధించాడు.తాను అనుకున్న విధంగా లండనులో ఉన్నతవిద్య పూర్తి చేయాలి.దేశం కోసం ఏదో ఒకటి చేయాలి.ఇదే రామకృష్ణయ్య గారి లక్ష్యం.నౌకలో ప్రయాణిస్తున్న సురేష్ బాబు సహకారం లభించింది.దైర్యంగా ముందుకు వెళ్ళాడు.నౌక దిగగానే భగవంతుని దయవల్ల రామకృష్ణయ్యకు అధికారులు అనుమతి ఇచ్చారు.దీంతో రామకృష్ణయ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.తన లక్ష్యాన్ని చేరుకొని అనుకున్న దాన్ని సాధించాడు.తోటివారందరికి స్ఫూర్తిగా నిలిచాడు.
IV.సృజనాత్మకత / ప్రశంస
1.కింది వానిలో ఒకదానికి జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ)చదువును కష్టంగా భావించవద్దు. ఉన్నత లక్ష్యం పెట్టుకొని,ఇష్టంగా చదువుకుని,అనుకున్నది సాధించాలని తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
లేఖ
జగద్దిరినగర్,
X X X X X .
ప్రియమైన మిత్రుడు రాజేష్ కు,
శుభాకాంక్షలు. నేను బాగా చదువుతున్నాను.నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను.ముక్యంగా వ్రాయునది నీవు ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలో ప్రవేశాన్ని పొందావు. నీకు అంగవైకల్యం ఉన్నా పట్టుదలతో చదివి ర్యంకు పొందావు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే చదువు గొప్ప సాధనం. ఇది నీకు తెలియంది కాదు.చదువును కష్టంగా ఏనాడు భావించవద్దు. మీ కుటుంబం నిరుపేదది.మీ తల్లిదండ్రులు ఎంతో కస్టపడి నిన్ను చదివిస్తున్నారు కదా ! వారి ఆశయాలను నీవు నెరవేర్చాలి.అందుకోసం నీవు చదువులో ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. విలాసాలతో,కబుర్లతో కాలాన్ని వృధా చేయవద్దు. చదివే చదువును ఇష్టంగా చదువు నీపై నాకు ఆ నమ్మకం ఉంది.నీవు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను.భగవంతుని దీవెనలు కూడా నీకు ఉంటాయి.
ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
X X X X X X X X .
చిరునామా: |
(లేదా)
అ)మీరు చేసిన ఒక ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ వ్యాసం రాయండి.
జ. ఇటీవలే మా బావ మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ కు బదలీ అయ్యాడు.మా అక్క బావాలు ఆలంపూరుకు రమ్మని బలవంతపెడుతున్నారు.
వేసవి సెలవులు."అక్కాబావల వద్దకు వెళదాం' అని నిర్ణయించుకున్నాం.అందుకు కాచిగూడా వెళ్ళి ఉదయం షుమారు 8 గంటల ప్రాంతంలో రైలు ఎక్కాం .కాని,జనంతో కిక్కిరిసి పోయింది ఆ రైలు.మేం ఎక్కిన బోగియంత వెదికాం.2 సీట్లు మాత్రమే ఖాళీలు ఉన్నాయి.అమ్మనాన్నలను బలవంతంగా వాటిపై కూర్చోండి అన్నాం.తమ్ముడికి,చెల్లికి కిటికీ ప్రక్కన కూర్చోవాలని ఆశ. మాకు ఎవ్వరికి సీట్లు దొరకలేదు.నిలబడే ఉన్నాం.అప్పుడప్పుడు తమ్ముడు,చెల్లి చెరొక కిటికీ వద్దకు వెళ్ళి,కిటికీలోంచి అనేక దృశ్యాలను చూస్తున్నారు.నాకు అలాంటి కోరిక ఉన్నా,లోలోపలనే అణుచుకున్నాను,కారణం పెద్దవాడిని కదా.
రైలులో అమ్ముకొనేవాళ్ళు సమోసాలు లాంటివి ఏవేవో అమ్ముతున్నారు."వాటిని తినకూడదు"అని పండ్లు,వేరుశెనగ కాయలు ఇప్పించారు.మేం వాటిని తింటూ కాలక్షేపం చేస్తూ ఉన్నాం.నాన్నకి కన్నడం మాట్లాడే వాళ్ళు దొరికారు.వారితో ఆయనకు కాలక్షేపం జరుగుతోంది.అమ్మ మాత్రం ఏమి తోచక దినపత్రిక ముందేసుకుని కాలక్షేపం చేస్తుంది.స్టేషనుకు మా బావ వచ్చాడు.మమ్మల్ని కలిసి అప్పటికే బేరం కుదుర్చుకున్న ఆటోలో ఎక్కమన్నాడు.అందరం దాంట్లో కూర్చున్నాం.ఆలంపూర్ కు ఆటో బయలుదేరింది.అక్కడక్కడా రోడ్డంతా గుంతలు,మిట్టల్తో నిండి ఉంది.ఆటో కుదుపునకు ఒక ప్రక్క నవ్వు,మరో ప్రక్క బాధ కలుగుతోంది.చివరకు ఇల్లు చేరుకున్నాం.ఆలస్యం అయినందుకు త్వరగా స్నానాలు చేసి,అన్నం తిని విశ్రాంతి తీసుకొన్నాం.
1 కింది వాక్యాల్లో గీతగీసిన పదానికి తగిన అర్దాన్ని గుర్తించండి. ( ఇ )
అ) చదువును సరిపడా ద్రవ్యం నావద్ద లేకుండె.
అ)శక్తి ఆ)సామర్థ్యం ఇ)డబ్బు ఈ)వస్తువు
ఆ)నామిత్రునికి సహాయపడతానని నేను వాగ్దానం చేశాను. ( ఆ )
అ)మాటతీసుకొను ఆ)మాటయిచ్చు ఇ)మాట మార్చు ఈ)డబ్బు యిచ్చు
2 కింది జాతీయాలను సొంతవాక్యాలలో రాయండి.
ఉదా :-అందెవేసిన చేయి
సీసపద్యాలు రాయడంలో శ్రీనాథుడిది అందెవేసిన చేయి
అ)పట్టరాని సంతోషం
జ)తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రాకతో ప్రజలు పట్టరాని సంతోషం పొందారు.
ఆ)దేవునిపై భారం వేయు
జ)అంత దేవునిపై భారం వేయుట ధీరుల లక్షణం కాదు.
ఇ)గుండె జల్లుమని
జ)భూకంప దృశ్యాలు గుండె జల్లుమనునట్లు ఉన్నాయి.
ఈ)చెమటలు పట్టు
జ)అరణ్యంలో పులిని చూడగానే న శరీరం చెమటలు పట్టినట్లు అయింది.
1.కింది వాక్యాలలో గీత గీసిన పదాలు ఏ సమాసాలో గుర్తించి,వాటి పేర్లు రాయండి.
అ)ఆదిశేషుని వేయితలలు :వేయి సంఖ్య గల తలలు - ద్విగు సమాజం
ఆ)కృష్ణార్జునులు సిద్దమైనారు : కృష్ణుడును, అర్జునుడును - ద్వంద్వ సమాసం
ఇ)రవి,రాము అన్నదమ్ములు :అన్నయును,తమ్ముడును - ద్వంద్వ సమాసం
ఈ)వారానికి ఏడురోజులు : ఏడు సంఖ్య గల రోజులు - ద్విగు సమాసం
ఉ)నూరేండ్లు జీవించు : నూరు సంఖ్య గల ఏండ్లు - ద్విగు సమాసం
2.కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
అ)విద్యాబ్యాసం =విద్య + అబ్యాసం - సవర్ణదీర్ఘ సంధి
ఆ)మొదలయింది = మొదలు + అయింది - ఉత్వసంధి
ఇ)విద్యార్థులు = విద్య + అర్థులు - సవర్ణదీర్ఘ సంధి
ఈ)ఏదైనా = ఏది + ఐన - ఇత్వసంధి
ఉ)వారందరు = వారు + అందరు - ఇత్వసంధి
3.కింది పదాలను పరిశీలించండి.
అ)రామయ్య = రామ + అయ్య
ఆ)మేనత్త /మేనయత్తా = మేన + అత్త
ఇ)సెలయేరు = సెల + ఏరు
ఈ)ఒకానొక = ఒక + ఒక
4.కింది పదాలను కలిపి రాయండి.ఏం జరిగిందో చెప్పండి.
ఉద:-తగిన + అంత = తగినంత
అ)చాలిన + అంత = చాలినంత
ఆ)సీత + అమ్మ = సీతమ్మ
ఇ)అక్కడ + ఇక్కడ = అక్కడిక్కడ
ఈ)అందక + ఉండెను = అందకుండెను
ఉ)చెప్పుట + ఎట్లు = చెప్పుటెట్లు
ఊ)రాక + ఏమి = రాకేమి
0 Doubts's