పార్ట్ - II
భాస్కరా ! = ఓ భాస్కరుడా !
చదువు + అది = చదువు
ఎంత +కల్గినన్ = ఎంత ఉన్నా
రసజ్ఞత = ఔచిత్యం
ఇంచుక = ఒకింత
చాలక + ఉన్నన్ = లేకుంటే
ఆ చదువు = ఆ విద్య అంతా
నిరర్ధకంబు = వ్యర్థం
ఎచ్చటన్ = ఎక్కడా
గుణసంయుతులు = సద్గుణ సంపన్నులు
ఎవ్వరు = ఎవరూ
మెచ్చరు = మెచ్చుకోరు
పదునుగా = మిక్కిలి నేర్పుతో
మంచికుర = మంచి కూర
అందున్ = ఆ కూరలో
ఇంపు +ఒదవెడు = రుచి కల్గించే
ఉప్పు = ఉప్పు
లేక = వేయకపోతే
రుచి = రుచి
భావం:భాస్కరా ! ఎంత గొప్ప చదువులు చదివిన కొద్దిగా విచక్షణ లేకపోతే ఆ చదువు వ్యర్థం.సద్గుణులు ఎవ్వరు మెచ్చుకోరు.నాలుక స్వయంగా వండినా కూరలో ఉప్పు వేయకపోతే రుచి పుడుతుందా?
ఇక్కడ కవి విచక్షణ ఉప్పుతోను,గొప్ప చదువును నలుని వంటి వాణి కూరతోను సమయం చూపాడు.సామాన్య విషయంతో సమర్దించాడు కనుక ఇది అర్దాంతరన్యాసాలంకారం.
దాశరథి ! = దశరథుని పుత్రుడైన ఓ రామా!
కరుణాపయోనిధీ ! = సముద్రమంతటి దయా కలవాడా!
పెంపునఁ = నన్ను పెంచడంలో
తల్లివి + ఐ = తల్లివై
కలుషబృంద = పాప సమూహాల
సమగమము = కలయిక
ఒందకుండా = నన్ను తాకకుండా
రక్షింపను = రక్షించడంలో
తండ్రివై = నాకు తండ్రివై
మెయి = నా శరీరంలో
వసించు = నివాసం ఉన్న
నివారింపను = నివారించడానికి
వెజ్జువై = వైద్యుడవై
కృప గుణించి = కృపతో
పరంబు = మోక్షం
ఈయన్ = ఇచ్చుటకు
గతి నీవే = సద్గతి నీవే !
భావం: దశరథ కుమారుడైన ఓ రామ ! దయ సముద్ర !నన్ను పెంచడంలో నీవే తల్లివి.పాపములు అంటకుండా రక్షించడంలో నీవే తల్లివి.ఇంద్రియాలనే రోగాలు నివారించడంలో నా పాలిటి వైద్యుడివి.కృపతో నాకు మోక్షం శాశ్వతం చేసే గొప్ప సంపదలియవయ్యా !
భావం: ధర్మపురి నివాసుడైన ఓ నృసింహ ! మనిషి పోయేటప్పుడు ఏమి పట్టుకుపోడు. ఎంత సంపాదించినా ఉప్పు,అన్నము తినాల్సిందే.లక్షలార్జించి అహంకారంతో వర్తించి,ఎవరికీ దానమీయక దాచి తుదకు దొంగలపాలో,దొరలపాలో చేస్తూ వుంటారు.తేనెటీగలు ఎంతో శ్రమించి కూడబెట్టిన తేనె తుదకు బాటసారుల పాలవుతుంది కదా !
ఇక్కడ ఒక విశేష విషయాన్నీ సామాన్య విషయంతో సమర్దించి చెప్పనైనది కనుక అర్దాంతరన్యాసాలంకారం.
0 Doubts's