Home SSC 8th Class తెలుగు ( 8వ తరగతి )

పార్ట్ - III

ఇవి చేయండి

I  విని అర్ధం చేసుకొని, అలోచించి మాట్లాడడం

1 .గేయాన్ని రాగయుక్తన్గా పాడండి.

జ. విద్యార్థి కృత్యం.

2.నదుల వల్ల ఏయే ప్రయోజనాలున్నాయో చర్చించండి.

జ. 1 . నదులు ప్రాణికోటికి జీవనాధారాలు.

2 . జీవనంలో అన్నింటికి అవసరమైన నీటిని మనం నదుల నుండి పొందుతాము.

3 .నదులకు ఆనకట్టలు కట్టి,ఆ నీటిని కాలువల ద్వారా మళ్ళించి,పంటలు పండిస్తాము.

4.ప్రకృతి పర్యావరణానికి నదులు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని,ఎంతో  మేలు చేస్తాయి.

5 .నదుల వలన తాగునీరు,సాగునీరు అందుతుంది.కనుక నదులు పవిత్రమైనవి,పుణ్యప్రదమైనవి.

II ధారాళంగా చదువడం - అర్ధం చేసుకొని ప్రతిస్పందించడం

1.కింది భావాన్నిచ్చే వాక్యాలు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి రాయండి.

అ)రైతు నాగలి ముందుకు సాగుతుంది.

జ. కర్షకుని నాగేలు కదలి ముందుకు సాగేను

ఆ)చిన్నబోయిన నేల గుండెను సేదతీరుస్తావు.

జ. గిడసబారిన పుడమి ఎడద కరిగించెదవు

ఇ)హైదరాబాద్ ప్రజలకు తీయని నీళ్ళందిస్తావు.

జ. భాగ్యనగరములోన వసియించు పౌరులకు పంచదారను బోలు మంచి నిరోసగెదవు

ఈ)పల్లెను తల్లి ప్రేమతో లాలిస్తావు.

జ. పల్లెటూళ్ళను కూర్మి తల్లివలె లాలించి

2.గంగాపురం హనుమచ్ఛర్మ రాసిన కింది గేయ పంక్తులు చదువండి.ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రవహింతువా దుందుభి మాసీమ

పాల యెఱుగ దుందుభి

చిరుగాలి కెరటాల

పొరలెత్తు అలలతో

దరులంటు అమృతశ్రీ

కారములౌ జలముతో

గిరులంటి ,వానిని

ర్ఘరులంటి,పైపైని

దరులంటి జాజి క్రొ

వ్విరుల వన్నియలుని ప్రవహింతువా -

ప్రశ్నలు:

అ)ఈ గేయం దేన్నిగురించి చెప్పింది?

జ. ఈ గేయం 'దుందుభి' నదిని గుర్చి చెప్తున్నది.

ఆ)దుందుభి నది ప్రవాహాన్ని కవి దేనితో పోల్చాడు?

జ. దుందుభి నది ప్రవాహాన్ని కవి పాలు ప్రవహించే నదితో పోల్చాడు.

ఇ)కవి దుందుభి నదిని పాలయేఱు అని ఎందుకన్నాడు?

జ.'పాలు' ఆరోగ్యానికి మంచిది.పాలు మధురంగా ఉంటాయి.దుందుభి నదిలో నీళ్ళు కూడా పాలవలె మధురంగాను.ఆరోగ్యవంతంగాను ఉంటాయని కవి అన్నాడు.

ఈ)'దరులు' - అనే పదానికి అర్థమేమిటి ?
జ.'దరులు' అనే పదానికి 'ఒడ్డులు' అనే అర్ధం.

ఉ)దుందుభి జలం ఎట్లా ఉన్నదని కవి ఉద్దేశం?

జ. దుందుభి జలం చిరుగాలి కదిలి,పొర్లిపడే కెరటాలతో,అమృతంలాంటి నీటి బిందువులతో పర్వతాలను,చెట్లను తాకి,సెలయేళ్ళతో కలిసి,జాజిపూవుల కొమ్మల అందాలను అడ్డుకొని పాలయేరులా ఉందని కవి ఉద్దేశం.

III  స్వీయరచన

1.కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ)"నది పొలానికి బలం చేకూరుస్తది" అని కవి ఎందుకన్నాడు?

జ. పొలాలు పచ్చగా ఉండాలంటే నీరు అవసరం.వర్షాలు బాగా కురిస్తేనే నదులు ప్రవహిస్తాయి.నదుల్లోని నీరే పంటపొలాలకు బలం.నదులు కేవలం నీటిని మాత్రమే కాదు సారవంతమైన మట్టిని కూడా పొలాలకు అందిస్తాయి.దాంతో పంటలు పచ్చగా పెరుగుతాయి.నదుల్లోని నీటిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి.దీనితోనే పంటలకు చక్కని బలం సిద్ధిస్తుంది.ఈ కారణం వల్లనే కవి  - "నది పొలానికి బలం చేకూరుస్తుంది " అని చెప్పాడు.

ఆ)భాగ్యనగరానికి,మంజీర నదికి ఉన్న సంబంధం తెలపండి.

జ. భాగ్యనగరాన్ని కులీకుతుబ్ షా నిర్మించాడు.ఇలాంటి భాగ్యనగరానికి సమీపంలోనే మంజీర నది ఉంది. ఈ కారణంగా భాగ్యనగరానికి,మంజీరానదికి విడదీయరాని సంబంధం ఉంది.మంజీర తమ అమృత జలాలను భాగ్యనగర వాసులకు అందిస్తుంది.ఈ నది భాగ్యనగర ప్రజలకు తాగునీటిని అందిస్తున్నది.

మంజీర భాగ్యనగరాన్ని తోబుట్టువులాగా లాలిస్తున్నది.గ్రామాల్లోని ధాన్యాన్ని నగర ప్రజలకు అందిస్తున్నది.ఈ విదంగా భాగ్యనగరవాసులకు, మంజీరకు విడదీయరాని సంబంధం ఉంది.

ఇ)మనం నదులను ఎట్లా కాపాడుకోవాలి?

జ. ఈ దేశంలోనైనా నదులు,దేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలు.నదులు ప్రవహించే ప్రాంతాలు,ధాన్యాగారాలుగా మారతాయి. మనదేశంలో జీవనదులయిన గంగా,సింధు,బ్రహ్మపుత్రలు ఉత్తర భారతాన్ని,కృష్ణా,గోదావరులు,దక్షిణ భారతాన్ని సస్యశ్యామలం చేస్తున్నాయి.పాడిపంటలతో అ ప్రాంతాల్ని కళకళలాడిస్తున్నాయి.మనకు కావలసిన తాగునీటిని,సాగునీటిని మనకు అందిస్తున్నాయి.విద్యుదుత్పత్తికి తోడుపడుతున్నాయి.రవాణా సౌకర్యాలను కలుగజేస్తున్నాయి.మానవుల జీవనానికి నదులు ఎన్నో విధాలుగా సాయపడుతున్నాయి.నదీతీరాలలోని పరిశ్రమలకు నీటిని అందిస్తున్నాయి.

కాబట్టి మనం అత్యంత ప్రాముఖ్యమైన నదీజలాలను భద్రంగా కాపాడుకోవాలి.మురికినీటిని, నదులలో కలపరాదు.నదీజలాల్లో బట్టలు ఉతకరాదు. పశువులను కడగరాదు.పరిశ్రమల వ్యర్దాలను నదీజలాల్లో కలుపరాదు.నదీజలాలను పరిశుభ్రంగా ఉంచి, మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి.కలుషిత నదీజలాలను తాగడం వల్లే,మనలో చాలామంది రోగాలబారిన పడుతున్నాము.కాబట్టి జాగ్రత్తపడదాం.మన నదులను మనం రక్షించుకుందాం.

ఈ)నదులు 'నాగరికతకు ఆలవాలం' - ఎందుకు?

జ. భారతదేశంలో గంగ,కృష్ణ,గోదావరి వంటి పుణ్యనదులు ప్రవహిస్తున్నాయి.ఎక్కువ భాగం నదులు హిమాలయ పర్వత సానువుల నుండే పుట్టాయి.మన దేశంలో గంగానదికి విశిష్టమైన స్థానం ఉంది.భారతీయులు నదులను దేవతామూర్తులుగా భావిస్తారు.వాటిని పూజిస్తారు,హారతులు ఇస్తారు.12 సంవత్సరాలకు ఒకసారి ప్రతి నదికి పుష్కరాలను నిర్వహిస్తారు.నదులలో నీటిలో ఔషధ గుణాలున్నాయని నమ్ముతారు.అందువల్లనే మన నదులు సనాతన 'నాగరికతకు ఆలవాలం' అని అంటారు. 

2.కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ)నదుల్లో కూడా నీళ్ళు కనుమరుగయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయో కారణాలు వివరించండి.

జ. నదులు మనకు త్రాగునీటిని,సాగునీటిని అందిస్తున్నాయి.విద్యుత్ ఉత్పత్తికి కూడా సహకరిస్తున్నాయి.ఏ రకంగా నదులు సకలజీవకోటికి ఉపయోగపడుతున్నాయి.ప్రస్తుతం నదుల్లో కూడా నీరు కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.దీనికి ప్రకృతితోపాటు మానవ తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి.వాటిలో ముక్యంగా కొన్ని-

1)సకాలంలో వర్షాలు కురవకపోవడం,వర్షపాతం చాలా తగ్గిపోవడం.

2)ఎగువ రాష్ట్రాలు నదులపై అక్రమ ప్రాజెక్టులను నిర్మించడం.

3)విద్యుత్ ఉత్పత్తికి పరిమితికి మించి నీటిని వృథాగా ఖర్చు చేయడం.

4)అడవులను పరిరక్షించకపోవడం.

5)పర్యావరణంలో సమతుల్యత దెబ్బతినడం.

6)నీటి పొదుపుపై ప్రభుత్వాలకు సరియైన అవగాహన లేకపోవడం.

IV సృజనాత్మకత / ప్రశంస

1.కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.

అ)మీ ప్రాంతంలోని లేదా మీరు చుసిన వాగు/చెరువు/నదిని వర్ణిస్తూ కవిత/గేయాన్ని రాయండి.

జ. మా ప్రాంతంలో గోతమి నది ప్రవహిస్తోంది.

కవిత గేయం:

"సప్తర్షి సంఘాన గౌతముడు పెద్ద

వనము పెంచెను ఋషి ఫలవృక్షములను

గోవొకటి దానిని భగ్నంబు చేసె

గౌతముడు కోపంగా కనువిచ్చి చూసే

భస్మమయ్యేను గోవు మునికోపదృష్టి

ఋషిమండలంబంత నిందించె ఋషిని

గౌతముడు తాపమున తపము చేయంగ

పరమేశుడాప్పుడు ప్రత్యక్షమయ్యే

గోవు స్వర్గతి చెంద శివు డంత కరుణ

గోదావరినదిని సృష్టించి విడిచె

నాసిక్కు క్షేత్రాన గోదావరీ మాత

V పదజాల వినియోగం

1.కింది పాదాలకు సమానార్థక పదాలను పట్టికలో గుర్తించి రాయండి.

  అ)రైతు          ఆ)చల్లదనం   ఇ)నేల

 ఈ)స్నేహం      ఉ) పంపి       ఊ) ప్రకాశించు

     భాష             పుడమి           నాగలి

     అంపి            విలసిల్లు        చలువ

     కర్షకుడు        కంకణము        సోపతి

జ. అ)రైతు         =    కర్షకుడు

     ఆ)చల్లదనం  =    చలువ

     ఇ)నేల         =     పుడమి

     ఈ)స్నేహం    =     సోపతి

     ఉ)పంపి        =     అంపి

     ఊ)ప్రకాశించు =     విలసిల్లు

2.కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు ప్రకృతి పదాలను రాయండి.

"రైతు ఎడద విశాలమైనది.ధాన్య  రాసులతో దేశాన్ని సుసంపన్నం చేస్తాడు.

జ. హృదయం (ప్రకృతి) - ఎడద (వికృతి)         రాశులు (ప్రకృతి) - రాసులు (వికృతి)

VI భాషను గురించి తెలుసుకుందాం

1.కింది ఖాళీలను పూరించండి.

సమాసపదం                   -            విగ్రహావాక్యం                          -       సమాజం పేరు

ఉదా.  సీతజడ                -          సీత యొక్క జడ                         -       షష్టి తత్పురుష సమాజం

        చెట్టు నీడ              -          చెట్టు యొక్క నీడ                        -       షష్టి తత్పురుష సమాజం

        వయోవృద్దుడు        -          వయస్సు చేత వృద్ధుడు                -       తృతీయ తత్పురుష సమాజం

        రాజశ్రేష్ఠుడు            -         రాజులలో శ్రేష్ఠుడు                        -       షష్టి తత్పురుష సమాజం

        అమంగళం             -         మంగళం కానిది                           -       నఇ  తత్పురుష సమాజం

        తిలకదారులు          -         తిలకమును ధరించినవాడు             -       ద్వితీయ తత్పురుష సమాజం

2.మరికొన్ని వృత్త్యనుప్రాస అలంకారానికి చెందిన వాక్యాలను పాఠాలలో వెతికి రాయండి.

జ. 1)పుట్టలోట్కల మిట్ట బట్టి మాపటివేళ

     2)ఉక్కిరి బిక్కిరియై తిరుగుచుండు

     3)రప్పించి మాయార్ద మొప్పించి

     4)లలిత సుగుణజాల తెలుగుబాల

     5)నిడువాడనినను నేనిట్లు విడుతునేని

     6)దానధర్మములేక దాచి దాచి

     7)విశ్వపాలన ధర్మ ! శ్రీ విశ్వకర్మ !