పార్ట్-2
సీ. ఎంత లెన్సగ నున్న నంత వేడుకె కాని
ప్రజల కల్మికనూయపడుట లేదు
తనుఁ గొల్వవలెనందణను ప్రియంబేకాని
మానిసి వెగ టించుకైన లేదు
నిచ్చ వేఁడిన నర్థికిచ్చు చిత్తమె కాని
మునుపింత యిచ్చితి ననుటలేదు;
రేవగల్ ధర్మమార్జించు దృష్టియె కాని
న్యాయంబు దప్పిన నడకలేదు;
తే. కలండె యిటువంటి రాజులోకమున నెందు ?
జలధి వలయిత వసుమతీచక్ర మెల్ల
నేలవలె శాశ్వతముగాగ నీ ఘనుండె;
యేలవలె నన్యు ? లన నా నృపాలుఁడలరు.
ప్రజలు ఎంత గొప్పగా ఉంటే, అంతగా 'సంతోషపడే వాడేకానీ, ప్రజల సంపదలను చూసి అసూయపడేవాడు కాదు. అందరితో కలసిమెలసి. ఉండడం ఇష్టమే కాని, ఎవరిపైనా అసూయతో ఉండేవాడు కాదు.తన్ను వేడిన యాచకులకు, దానం చేసేవాడే కాని, పూర్వం ఇంత ఇచ్చానని చెప్పి వారిని సాగనంపేవాడు కాడు. రాత్రింబగళ్ళు ధర్మకార్యాలు చేస్తూ, పుణ్యం సంపాదించాలనే దృష్టేకాని, అన్యాయంగా ప్రవర్తించేవాడు కాదు. ఇటువంటి రాజు లోకంలో ఎక్కడైనా ఉన్నాడా ? (లేడు). సముద్రంచే చుట్టుకొనబడిన ఈ భూమండలాన్ని అంతటినీ, ఈ గొప్ప గుణాల ధర్మరాజే, శాశ్వతంగా పాలించాలి. ఇతర రాజులు ఎందుకు ? అని ప్రజలు అనుకొనేటట్లు, ఆ ధర్మరాజు ప్రకాశించాడు.
ఉ. కోపమొకింతలేదు;బుధకోటికిఁగొంగుఁబసిండి; సత్యమా
రూపము; తారతమ్యములెఱుంగు; స్వతంతు(డు; నూతన ప్రియా
టోపములేని నిశ్చలుఁడిటుల్ కృతలక్షణుఁడై చెలంగఁగా
ద్వాపర లక్షణుం డనగవచ్చునొకో యల ధర్మనందనున్?
కోపం కొంచెం కూడా లేదు. పండిత సమూహానికి మూటకట్టిన కొంగు బంగారం. సత్యస్పరూపుడు. మనుష్యులలో వ్యత్యాసాలు తెలిసినవాడు. మంచిచెర్డలను తాను ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్వతంత్రుడు. కొత్త విషయాలపట్ల ఆడంబరాలులేని స్థిర స్వభావం గలవాడు. ఈ విధంగా ప్రసిద్ధమైన మంచి లక్షణాలు కలవాడైన ఈ ధర్మరాజును ద్వాపర లక్షణుడు అంటే సందిగ్ధ లక్షణాలు కలవాడు (ద్వాపరయుగం వాడు అని కూడా) అని అనవచ్చునా? (అనకూడదు ) కృతలక్షణుడు అని అనాలి.
1.స్నేహ భావం ఎవరితో పెంపొందించుకోవాలి?
జ: స్నేహ భావం సత్పురుషులతో పెంపొందించుకోవాలి .
ధర్మ రాజు వంటి సత్పురుషులు:
1 ) ప్రజలు సంపదలకు సంతోషిస్తారు,అసూయపడరు .
2 ) ప్రజలందరూ తనను సేవించాలని అనుకుంటున్నారు.వీరు ఎవరిని వెగటుగా చూడరు .
3 )అడిగిన వారికి ఇద్దామని అనుకుంటున్నారు.పూర్వమే అతడికి ఎంతో ఇచ్చామని అనరు.
4 ) రాత్రిబగళ్ళు ధర్మార్జున దృష్టితో ఉంటారు. అన్యాయవర్తన ఉండదు.కాబట్టి ధర్మరాజు వంటి సత్పురుషులతో స్నేహ భావం పెంపొందించుకోవాలి.
2 .''కొంగు బంగారం'' అనే మాట ఎప్పుడైనా విన్నారా?అయితే దాని గురించి మీరేమను కుంటున్నారో చెప్పండి ?
జ: ''కొంగు బంగారం'' అనేది తెలుగు జాతీయము. సులభ సాధ్యము అని దీనికి అర్ధము.పూర్వులు తమకు కావలిసిన ధనాన్ని చెంగున ముడివేసుకునేవారు. ఆ రోజుల్లో మనీ పర్సులు లేవు. వారికి ఏదైనా డబ్బు అవసరం ఐతే వెంటనే చెంగున లేక కొంగున ముడి వేసిన ముడి విప్పి , అందులో కావలిసిన మొత్తాన్ని వారు సులభంగా వాడుకునేవారు . వారి డబ్బు ఏ పెట్టెలోనో ఉండి ఉంటే అంత సులభంగా అది వారి అవసరానికి ఉపయోగించదు. ఆ విధంగా కొంగుబంగారం అంటే , సులభంగా అయ్యే పని అని అర్ధంలో , ఆ జాతీయం వాడుకలోకి వచ్చింది.
0 Doubts's