పార్ట్-1
1) ప్రజలు గాంధీజీ ని ఎందుకు ఆరాధించారు?
జ: గాంధీజీ భారతదేశంలో అన్ని వర్గాలకు ఏకైక మార్గదర్శకుడు అయ్యాడు .
2) నాయకులు గాంధీజీని ఎందుకు, అనుసరించారు?
జ: గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి, ఉప్పు సత్యాగ్రహానికి దండియాత్ర ప్రారంభించారు. గాంధీజీ స్వాతంత్రోద్యమాన్ని అహింసామార్గంలో ప్రజలందరినీ. ఏకంచేసి సైన్యంలా నడిపించారు. అందువల్ల నాయకులు, గాంధిజీని అనుసరించారు.
3)గాంధీజీ హింసా మార్గాన్ని ఎందుకు అనుసరించాడు?
జ: బ్రిటిష్‌వారి వద్ద అంతులేని సైన్యం ఉంది. వారివద్ద త్రుపాకులూ, ఫిరంగులూ ఉన్నాయి. హింసా మార్గంలోబ్రిటిష్ వారిని ఎదురించడం కష్టం. హింసాపద్ధతిలో వెడితే, ఎందరో దేశభక్తులు, ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. శాంతియుతంగా ఉద్యమాన్ని ఎక్కువకాలము నడుపవచ్చు. బ్రిటిష్ వారిని లొంగదీయవచ్చు.వారి సానుభూతి సంపాదించవచ్చు. అందుకేగాంధీజీ హింసా మార్గాన్ని అనుసరించారు.
పాఠం |
ఉద్యమస్ఫూర్తి |
రచయిత్రి |
సంగెం లక్ష్మీబాయి |
దేని నుండిగ్రహించబడినది |
రచయిత్రి రాసిన నా జైలు జ్ఞాపకాలు - అనుభవాలు అనే ఆత్మకథ నుండి గ్రహించబడినది. |
జన్మస్థలము |
ఈమె మేడ్చల్ జిల్లాలోని 'ఘటకేశ్వరం' అనే గ్రామంలో జన్మించింది. |
జననమరణాలు |
జననము 27-07-1911. మరణము 1979 వ సంవత్సరం |
ఉద్యోగం |
హైదరాబాదు నారాయణగూడ భాలికల ఉన్నతపాఠశాల వార్దెనుగా, తెలుగుపండితురాలిగా ఈమె పనిచేసింది. |
పదవులు |
ఈమె బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేశారు. ఈమె 1957 నుండి 1971 వరకు 15 సంవత్సారాలు లోక్‌సభ ,సభ్యురాలుగా ఉన్నారు. |
పాల్గొన్న ఉద్యమాలు |
1) గాంధీజీ పిలుపు పాల్గొని, జైలుకు వెళ్లిన మొదటి తెలంగాణ మహిళ ఈమె. 2) 1951లో తెలంగాణలో వినోబాభావే చేసిన భూదానోద్యమ యాత్రలో పాల్గొన్న ప్రథమ మహిళ ఈమె. |
1.తమ బ్రతుకు వరకు పరిధుల్ని పరిమితం చేసుకోవటం అంటే ఏమిటి?
జ. ఈ రోజుల్లో మనుష్యులు, దేశంలో, రాష్ట్రంలో లేక తమ గ్రామంలో ఏమి జరిగినా, 'పట్టించుకోడం మానివేశారు. ఏ సంఘటన. జరిగినా, అది తమకూ తమ వారికీ సంబంధించినవి కాకపోతే, వాటిని వార్తు పట్టించుకోడం. మానివేశారు. ఆ సంఘటన ప్రభావం, తమపై పడినప్పుడే, మనుష్యులు శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతి విషయాన్నీ తమచుట్టూ గిరిగీసుకొని, తనకూ తమవారికీ వారు పరిమితమవుతున్నారని అర్ధం.
2.విప్లవసంఘం వారి చర్యలు కొన్ని ఎందుకు అద్భుతంగా ఆశ్చర్యకరంగా తోచినాయి?
జ. ఆనాడు విప్లవకారులు, చిత్ర విచిత్రమైన బాంబులు తయారు చేసేవారు. అందులో ఇంద్రపాల్ అనే అతడు, మిత్రుల ప్రోదృలంతో స సన్యాసి వేషంలో వెళ్ళి, వైస్రాయి మీద బాంబు పేల్పాడు. ఈ విధమైన వారి చర్యలు,అహింసావాదులయిన దేశభక్తులకు, అద్భుతంగానూ, ఆశ్చర్యకరంగానూ తోచాయి.
3. సుఖదేవ్, భగత్‌సింగులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి దేశంలోని ప్రతి ఒక్కరు ఎందుకు తల్లడిల్లిపోయారు?
జ. సుఖదేవ్, భగత్‌సింగ్‌లు విప్లవ సంఘంలోని సభ్యులు.విప్లవసంఘం వారు కూడా దేశభక్తులే. వారి ఉద్యమం కూడా స్వాతంత్ర్య సిద్ధి కోసమే. కాని అహింసావాదుల విధానాలు, విప్లవ సంఘంవారి వీధానాలు వేరు వేరుగా ఉండేవి. విధానాలు వేరైనా సుఖదేవ్, భగత్‌సింగులు,దేశభక్తులైనందువల్ల, వారికి ఉరిశిక్ష పడుతుందని తెలిసి, దేశంలో ప్రతి ఒక్కరు తల్లడిల్లిపోయారు.
0 Doubts's